ఇసుక తెన్నెలని తాకే జల తరంగాల హోరు, పిల్ల తెమ్మెరల ప్రకృతి వింజామరల జోరు.... లీలగా గుర్తుకి తెస్తున్నాయ్... నాదంటూ ఒక లోకం ఉందని, నా సరసన సరస సారంగివై తరంగ సాధృశ నయగారముతో చేసే నృత్య కేళీ విలాసమేదో నా మది పొరలలో అంతర్మధనమై నే సేద తీరగా... పలునాల్ల జీవమెందుకోయీ ఓ విధాతా అనిపించు నీ సమ్మోహన స్వరూపపు సౌందర్య లావణ్యములకు మించిన అతిశయములుండునా??? :)